Showing posts with label అతి పైత్యం. Show all posts
Showing posts with label అతి పైత్యం. Show all posts

Friday, November 26, 2010

గుండె మంటకు - గురిఐన యోగం



పైత్య శరీరాలకు  వేసవికాలంలో కాల స్వబావం వల్ల  పిత్తం  ప్రకోపించి గుండెల్లో మంట కలుగుతుంది .


 ఇలాంటి మంటలు వేసవిలో వస్తాయని ముందుగానే ఊహించిన మన భూమి తల్లి ఆ  మంటను మటు మాయం చేయగల పుచ్చకాయాలను  మనకందించింది  . పుచ్చకాయలోని గింజలు 20  గ్రాములు మోతాదుగా  తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి  ఒక రాత్రి నానబెట్టాలి . ఉదయం పుట ఆ గింజలను నీటితోనే బాగా పిసికి  వడపోసి అందులో ఒక చెంచా కండచేక్కర పొడి కలిపి తాగాలి ...


ఇలా రోజు సేవిస్తుంటే ఆతి త్వరగా గుండెల్లో మంట ఆణగారి పోతుంది .







Monday, November 8, 2010

వేడిని తరిమి కొట్టే - విలువైన గులాబీ షర్బత్




రెండు లీటర్ల  మంచి నీరు kadai  పాత్రలో  పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60  గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .  


క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి  , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి 
ఆ కషాయాన్ని  మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100  గ్రాములు  కలిపి లేత పాకం వచ్చే  వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .

ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా  మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో  కలిగే అతి  దాహం  , అతి పైత్యం హరిన్చిపోతాయి  .

కాలేయానికి బలం కలుగుతుంది  . ప్రాణానికి హాయిగా వుంటుంది .