Friday, November 26, 2010

గుండె మంటకు - గురిఐన యోగం



పైత్య శరీరాలకు  వేసవికాలంలో కాల స్వబావం వల్ల  పిత్తం  ప్రకోపించి గుండెల్లో మంట కలుగుతుంది .


 ఇలాంటి మంటలు వేసవిలో వస్తాయని ముందుగానే ఊహించిన మన భూమి తల్లి ఆ  మంటను మటు మాయం చేయగల పుచ్చకాయాలను  మనకందించింది  . పుచ్చకాయలోని గింజలు 20  గ్రాములు మోతాదుగా  తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి  ఒక రాత్రి నానబెట్టాలి . ఉదయం పుట ఆ గింజలను నీటితోనే బాగా పిసికి  వడపోసి అందులో ఒక చెంచా కండచేక్కర పొడి కలిపి తాగాలి ...


ఇలా రోజు సేవిస్తుంటే ఆతి త్వరగా గుండెల్లో మంట ఆణగారి పోతుంది .







Monday, November 8, 2010

వేసవి లో - నపుంసకత్వం కలుగకుండా

సహజంగానే వేసవి స్వబావం  వాళ్ళ పురుషులలో వీర్య శక్తీ  తగ్గిపోతుంది .


సూర్యుని తీవ్రమైన తాపానికి మానవ శరీరాలు  వడలిపోతాయి  . అందుకే మహర్షులు వేసవిలో ఆతిగా రతిలో పాలగోనకుడదని , బాగా ఆరోగ్యవంతమైన పురుషుడు పదిహేను రోజులకు ఒక సరి మాత్రమే సంభోగం జరుపవచ్చని  ఆంక్షలు విదించారు .


అందువల్ల  పురుషులు తమ వీర్య శక్తి వేసవి లో  కూడా తగ్గకుండా ముందు నుండే జాగ్రత్తపడాలి  .


రెండు పూటలా  ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ  ముక్కను కలిపి తింటూ వుండాలి  . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది  . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .

వేడిని తరిమి కొట్టే - విలువైన గులాబీ షర్బత్




రెండు లీటర్ల  మంచి నీరు kadai  పాత్రలో  పోసి అందులో , నీడలో ఎండించిన గులాబీ రేకులు 60  గ్రాములు వేసి చిన్న మంట పైన మరిగించాలి .  


క్రమంగా ఒక లిటరే నీరు ఈగిరిపోయి  , ఒక లిటరే కాషాయం మరిగే వరకు మరిగించి వడపోయాలి 
ఆ కషాయాన్ని  మరల పొయీ మీద పెట్టి అందులో పటిక బెల్లం పొడి 100  గ్రాములు  కలిపి లేత పాకం వచ్చే  వరకు కాచి , పాత్రను దించి పదార్దాన్ని చల్లార్చి ఒక గాజు సీసాలో నిలువ చేసుకోవాలి .

ఒక చెంచా పాకం ఒక కప్పు చల్లని నీటిలో కాచితే అది ఆతి మధురమైన పానీయంగా  మారుతుంది . ఇలా మూడు పుటల నీటితో కలిపి తాగుతుంటే వేసవిలో  కలిగే అతి  దాహం  , అతి పైత్యం హరిన్చిపోతాయి  .

కాలేయానికి బలం కలుగుతుంది  . ప్రాణానికి హాయిగా వుంటుంది .

ఎండాకాలం - ఎదురులేని ఆరోగ్యం

ఎండాకాలంలో చల్లదనాన్ని అందించే ములికలను వాడటం ద్వార వేసవి వ్యాదుల నుండి సురక్షితంగా తప్పించుకోవచ్చు .

సుగంధ పాల వెళ్ళ పొడి  , ధనియాల పొడి  , దోరగా వేయించిన శొంటి పొడి సమంగా కలిపి వుంచుకోవాలి. 

ఒక గ్లాస్ మంచి నీటిలో  ఒక చెంచాపొడి వేసి ఒక కప్పు కు మరిగించి వడపోసి , అందులో తగినన్ని పాలు తగినంత చెక్కెర  కలిపి సేవిస్తూ వుంటే శరీరానికి అధిక వేడి కాలంలో కూడా నీరసం నిస్సతువ రాకుండా రక్షణ కలుగుతుంది  .


 

రక్తంలో వేడి - రక్త వీరేచనలు - వాంతులు


పండిన మేడి పండ్లను తేనె  తో  కలిపి తింటుంటే రక్తంలో వేడి , రక్త వీరేచనలు  , వాంతులు కట్టుకుంటాయి .



 

నిక్కకకు - నిక్కర్పైన యోగం



శరీరంలో ఉడుకు జీర్ణించుకుపోయిన వారిని నిక్కాకు శారిరులు అంటారు . వీరికి వర్ష కాలం , చలి కాలాలలో కూడా శరీరము వేడి సెగలు గాక్కుతూ  వుంటుంది . ఇక వేసవి లో వీరి బాధ  వర్ణించ వలసిన అవసరము లేదు . అలంటి వారు ఈ క్రింది మార్గాలలో ఏదో ఒకటి ఆచరించాలి  .


1  . నీరుల్లిగడ్డను ముక్కలుగా కోసి నునే తో వేయించి పెరుగులో వేసి నానబెట్టాలి . ఆ ముక్కలను పెరుగుతో పాటు రోజు  తింటుంటే నిక్కాకు హరిఇంన్చి పోతుంది  ( లేక ) 


2  . కరక గింజలలో ని  పప్పు , దోరగా వేయించి శొంటి  పొడి  సమంగా కలిపి తేనె తో  మెత్తగా , నూరి కుంకుడు గింజంత గోలీలు కట్టి ఆరబెట్టాలి . 
పుటకు ఒక గోలి చొప్పున రెండు పుటల మంచి నీళ్ళతో  వేసుకుంటూ వుంటే , అధికమైన ఉడుకు , కాకా  తగ్గిపొతయీ .  

వడ దెబ్బ - తగిలితే






నీరుల్లిపాయల రసాన్ని  వడ దెబ్బ తగిలిన వ్యక్తికీ , కనతలకు గుండెకు బాగా లేపనం చేయాలి. 



 


పుచ్చకాయ రసం కానీ , బార్లీ జావాలో పటికబెల్లం కలిపిగాని , లేక కొబ్బరి నీళ్ళు గానీ  మెల్ల మెల్లగా కొద్ది  కొద్దిగ సేవింప చేయాలి .




చల్లని గల్లి వచ్చే చోటు పరుoడా   బెట్టాలి . కొబ్బరి నునే శార్రిరమంతా  మర్దన చేయాలి . 

అవకాశముంటే  మంచి గంధం చెక్కతో సాది , ఆ గంధాన్ని శరీరానికి  లేపనం చేయాలి ..

ఇలా సీతోపచారాలు చేస్తుంటే త్వరగా కోలుకుంటారు.