Monday, November 29, 2010

పళ్ళు చిగుళ్ళ నుండి - రక్తం కారుతుంటే ?



 కొంతమందికి పండ్లు  తినేటప్పుడు , అన్నం గాని , మరేదైనా తినేటప్పుడు  , ఒక్కోసారి మాట్లాడేటప్పుడు  కూడా , పండ్లు  చిగుళ్ళ నుండి చీము  , నెత్తురు  కారుతూ  నోర్రంతా గబ్బుకోడుతూ వుంటుంది  . అన్నవాహికలో క్రిమిదొషం వల్లగని      , మేహవుడుకువల్లగాని  , విష రసాయనాలతో కూడిన పేస్టు లున ఆధికంగా వాడటం తో దంతక్షయం  కావటం వల్లగాని ఈ సమస్య వస్తుంది .


 పరిష్కారం :   నీరుల్లిగడ్డను ఆతి మెత్తని  గుజ్జుగా నూరి  ఆ గుజ్జుతో పండ్లు చిగుళ్ళు బాగా తోమాలి . లోపల బయట భాగాలలో   కూడా రుద్దాలి  . రుద్దిన తరువాత ఆరగంట ఆగి గోరువెచ్చని  నీటితో పండ్లు కడగాలి . ఇలా వరం రోజులు చేసేటప్పటికి ఎంతో కాలం నుండి  వేదించే ఈ సమస్య అంతులేకుండా మళ్ళి కనిపించకుండా   పోతుంది .

వృద్ధ స్త్రీ పురుషులకు సైతం యవ్వనం ఇవ్వగల - యవ్వన ప్రాస్

ఆతి మధురం  10 గ్రా . 
చిన్న యాలకులు  10  గ్రా 
లవగంగాలు  10  గ్రా  
ఆకుపత్రి -   10 గ్రా 
శొంటి    - 10   గ్రా 
పిప్పళ్ళు   - 10 గ్రా 
మిరియాలు - 10 గ్రా 
ఎండు ఖర్జూరాలు   - విత్తనం తీసినవి  20  గ్రా 
సారపప్పు   - 20  గ్రా 
ధనియాలు  - 20  గ్రా 
వకుడుకాయలు   - 20  గ్రా  
వేలవేము చూర్ణం       20 గ్రా

ఎండుద్రాక్ష  లేక  ఎండు కిస్ మిస్   200  గ్రా  (  గింజలు లేనివి )
కండచక్కెర       - 200 గ్రా 


      పై పదార్దాలు  విడివిడిగా  చుర్నలుగా చేసుకొని  అందులో  ఖర్జూరం , కిస్ మిస్ కూడా కలిపి రోటిలో  వేసి దంచితే మొత్తం ముద్దలాగా హల్వాలగా అవతుంది  .


  రోజు  ఉదయం పరగడుపున ఒక్కసారి , రాత్రి నిద్రించే ముందు ఒకసారి  20  గ్రాముల మోతాదుగా తింటూ  అనుపానంగా  ఒక కప్పు వేడిపాలలో ఒక చెంచా కండచక్కెర  కలిపి త్రాగుతువుండాలి .


ఫలితాలు  :  హస్త ప్రయోగం , ఆతిస్కలనం వంటి దురభ్యసల  వల్ల  , ఆల్పహర సేవన వల్ల , వయసు పై బడిన వృద్ధాప్యం వల్ల , దేని వల్లనైన శరీరంలో రక్తమాంసాలు  హరిన్చిపోయి  , బక్కచిక్కిన  బలహీన  స్త్రీ పురుషులంతా ఈ లేహ్యన్ని  సేవించటం ద్వార తిరిగి మరల నవ వసంతాన్ని పొందవచ్చని మహా ఋషులు పేర్కొన్నారు .

క్షయ రోగులకు

గోముత్ర శిలజిత్ పుటకు 2  గ్రా . కప్పు  ఆవు పాలతో 2  పూటలా  సేవిస్తువుంటే  క్షయ  రోగం క్షయించిపోతుంది   .



Friday, November 26, 2010

రక్త స్రవం

ద్రాక్ష  ,  గంధం   ,    సమచుర్ణం తేనె తో 10  గ్రాముల మోతాదుగా తింటుంటే  ఎటునుండి పోయే రక్తప్రవహమైనా  ఆగిపోతుంది .  

రక్తపోటు --- రక్త వేడి

 

ఖర్జూర  పండ్లను తేనె తో కలిపి తిన్తువుంతే రక్తపోటు  , రక్త వేడి  హరించి పోతాయి 




గుండె మంటకు - గురిఐన యోగం



పైత్య శరీరాలకు  వేసవికాలంలో కాల స్వబావం వల్ల  పిత్తం  ప్రకోపించి గుండెల్లో మంట కలుగుతుంది .


 ఇలాంటి మంటలు వేసవిలో వస్తాయని ముందుగానే ఊహించిన మన భూమి తల్లి ఆ  మంటను మటు మాయం చేయగల పుచ్చకాయాలను  మనకందించింది  . పుచ్చకాయలోని గింజలు 20  గ్రాములు మోతాదుగా  తీసుకొని ఒక గ్లాస్ నీటిలో వేసి  ఒక రాత్రి నానబెట్టాలి . ఉదయం పుట ఆ గింజలను నీటితోనే బాగా పిసికి  వడపోసి అందులో ఒక చెంచా కండచేక్కర పొడి కలిపి తాగాలి ...


ఇలా రోజు సేవిస్తుంటే ఆతి త్వరగా గుండెల్లో మంట ఆణగారి పోతుంది .







Monday, November 8, 2010

వేసవి లో - నపుంసకత్వం కలుగకుండా

సహజంగానే వేసవి స్వబావం  వాళ్ళ పురుషులలో వీర్య శక్తీ  తగ్గిపోతుంది .


సూర్యుని తీవ్రమైన తాపానికి మానవ శరీరాలు  వడలిపోతాయి  . అందుకే మహర్షులు వేసవిలో ఆతిగా రతిలో పాలగోనకుడదని , బాగా ఆరోగ్యవంతమైన పురుషుడు పదిహేను రోజులకు ఒక సరి మాత్రమే సంభోగం జరుపవచ్చని  ఆంక్షలు విదించారు .


అందువల్ల  పురుషులు తమ వీర్య శక్తి వేసవి లో  కూడా తగ్గకుండా ముందు నుండే జాగ్రత్తపడాలి  .


రెండు పూటలా  ఆహారంలో నేతిలో వేయించిన ఒక నీరుల్లిగడ్డ  ముక్కను కలిపి తింటూ వుండాలి  . దీని వల్ల యవ్వన సంపద శరీరంలో స్తిరమవ్తుంది  . వేసవి లో కూడా విర్యశక్తి విజరమ్బిస్తుంది .